ఆ ఐదుగురికి జాక్ పాట్ ఖాయం, ఫ్రాంచైజీల టార్గెట్ వీళ్ళే
ఐపీఎల్ మెగావేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఆదివారం, సోమవారం సౌదీ అరేబియా సిటీ జెడ్డా వేదికగా మెగా ఆక్షన్ జరగనుండగా.. ఇప్పటికే 574 మంది ప్లేయర్స్ ను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సారి వేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్స్ కూడా వచ్చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.