పాండ్యా గ్యారేజీలో మరో లగ్జరీ కారు

టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా వరల్డ్ కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి ఫైనల్లో సౌతాఫ్రికాను దెబ్బతీసిన పాండ్యా వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

Post Published By: Vencateshg
Updated : 17 August 2024, 5:34 PM IST

టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా వరల్డ్ కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి ఫైనల్లో సౌతాఫ్రికాను దెబ్బతీసిన పాండ్యా వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న హార్థిక్ ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. జపాన్ కార్ల సంస్థ లెక్సస్ కి చెందిన LM350h MPVని సొంతం చేసుకున్నాడు.

ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర 2.5 కోట్లు. అంబానీ ఫ్యామిలీ, రణబీర్ కపూర్ తర్వాత ఈ కారు కొన్న మొదటి భారత క్రికెటర్ పాండ్యానే. కాగా ఇప్పటికే పాండ్యా గ్యారేజీలో 6 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ తో పాటు లంబోర్ఘిని హురాకాన్, రేంజ్ రోవర్ వోగ్ , మెర్సిడెస్ AMG , పోర్స్చే కయెన్ వంటి లగ్జరీ కార్లున్నాయి.

Published : 
  • 17 August 2024, 5:34 PM IST