బ్యాట్ తో రాణిస్తున్న చాహల్ రంజీల్లో కీలక ఇన్నింగ్స్ లు

భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఇప్పుడు బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు. గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైన చాహల్ మొన్నటి వరకూ కౌంటీ క్రికెట్ లో అదరగొట్టాడు.

Post Published By: Vencateshg
Updated : 29 October 2024, 8:32 PM IST

భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఇప్పుడు బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు. గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైన చాహల్ మొన్నటి వరకూ కౌంటీ క్రికెట్ లో అదరగొట్టాడు. తన స్పిన్ మ్యాజిక్ తో ఇంగ్లీష్ గడ్డపై ఆకట్టుకున్నాడు. తాజాగా రంజీ సీజన్ లో బ్యాట్ తోనూ సత్తా చాటుతున్నాడు. బక్కపలచని శరీరంతో ఉండే చాహల్ రంజీల్లో సుధీర్ఘంగా బ్యాటింగ్ చేస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో చహల్‌ 152 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేశాడు. తాజాగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 142 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. ఎప్పుడూ ఇంతటి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడని చహల్‌ ఒ‍క్కసారిగా ప్రొఫెషనల్‌ బ్యాటర్‌లా మారిపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Published : 
  • 29 October 2024, 8:32 PM IST

Topics :