నేను గెలుస్తాను అని చెప్తే ఎవరూ వినరు.. గెలిచాక చెప్తే ఎవరైనా వింటారు. కాంగ్రెస్‌కు పక్కాగా సరిపోయే మాట ఇది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్ పేరు చెప్తే ఇన్నాళ్లు దూరం జరిగిన పార్టీలు.. ఇప్పుడు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయ్. హస్తం పార్టీ పని అయిపోయింది. మూడో కూటమి రావాల్సిన అవసరం ఉందని రాగం అందుకున్న నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్‌కు జై అంటున్నారు. మద్దతు ప్రకటిస్తున్నారు.

Mamath Support To Congress Party