తెలంగాణలో అధికార పీఠంపై కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టిన పథకాల్లో మహాలక్ష్మి పథకం ముఖ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి తెలంగాణలో మహిళలంతా ఫ్రీగా బస్‌లలో ప్రయాణిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బస్ ప్రయాణం ఫ్రీ అవ్వడంతో చాలా మంది మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో చాలా వరకూ ఆటోలకు మహిళల నుంచే ఉపాధి వస్తుంది.

Good news for auto drivers.. CM Revanth's sensational decision..