ఆస్ట్రేలియా పిచ్ లు అంటేనే పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి.. ఈ బౌన్సీ వికెట్లపై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకుంటారు… ఇక ఆతిథ్య ఆసీస్ బౌలర్లయితే చెలరేగిపోతుంటారు.. అందుకే ఆసీస్ గడ్డపై కంగారూలకు ఓడించడం చాలా కష్టం… అయితే ప్రత్యర్థి జట్లలో ఉండే మంచి పేసర్లు కూడా ఆసీస్ పిచ్ లపై అదరగొడుతుంటారు.
