పోలీస్ విచారణలో ఏడ్చేసిన జానీ మాస్టర్, సంచలన విషయం బయటకు…!

జూనియర్ డాన్సర్ పై ఆత్యాచారం కేసులో జానీ మాస్టర్ విచారణకు సహకరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల్లో జానీ మాస్టర్ నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.

Post Published By: Vencateshg
Updated : 28 September 2024, 11:06 AM IST

జూనియర్ డాన్సర్ పై ఆత్యాచారం కేసులో జానీ మాస్టర్ విచారణకు సహకరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల్లో జానీ మాస్టర్ నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. నేటితో జానీ మాస్టర్ నాలుగవ రోజు కస్టడీ ముగియనుంది. సాయంత్రం జానీ మాస్టర్ జ్యుడీషియల్ రిమాండ్ కి తరలిస్తారు. జానీ మాస్టర్ ను ఉప్పర్ పల్లి కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టె అవకాశం ఉంది.

పోలీసుల కస్టడీ విచారణకు జాని మాస్టర్ నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉందని పోలీసులు వెల్లడించారు. కస్టడీ విచారణలో బాధితురాలే తనను వేధించిందని స్టేట్ మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది అని ఆయన పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు. తన టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా యువతికి అవకాశం ఇచ్చానని తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేది అని జానీ మాస్టర్ తెలిపాడు. నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారు అని పోలీసుల ఎదుట జానీ మాస్టర్ కన్నీరు పెట్టుకున్నట్టు సమాచారం.

Published : 
  • 28 September 2024, 11:06 AM IST