శతక్కొట్టిన లివింగ్ స్టోన్ రెండో వన్డే ఇంగ్లాండ్ దే
వెస్టిండీస్ టూర్ లో ఇంగ్లాండ్ తొలి విజయాన్ని అందుకుంది. ఇంగ్లీష్ క్రికెటర్ లివింగ్ స్టోన్ సెంచరీతో దుమ్మురేపడంతో రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్ 328 పరుగుల భారీస్కోర్ చేసింది.