బిగ్ బాస్ హౌస్‌లో హిస్టరీ క్రియేట్ అయ్యింది.. బిగ్ బాస్ ఏడో సీజన్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కప్ కొట్టాడు. కామన్ మెన్ గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విజేతగా అవతరించాడు. బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్ గా రికార్డుల కెక్కాడు.. వెక్కిరింతలను, చిన్నచూపులను తట్టుకొని నిలబడి.. అందరి అంచనాలు, అభిప్రాయాలను తారుమారు చేస్తూ.. హౌజ్‌లో తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు పల్లవి ప్రశాంత్..

Pallavi Prashanth who created history.. Rythu Bidd is the title