Title Winner

Bigg Boss season 7 : గౌతమ్ ఎలిమినేషన్.. టైటిల్ విన్నర్ కి 50 లక్షలు..

Bigg Boss season 7 : గౌతమ్ ఎలిమినేషన్.. టైటిల్ విన్నర్ కి 50 లక్షలు..

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని వారాల్లో ఈ సీజన్ 7 కు ముగింపు పలకనున్నారు. ఈ క్రమంలో ఫైనలిస్ట్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి ఒక టాస్క్ ఇచ్చాడు. ఇప్పుడు 13వ వారం సైతం పూర్తైంది. ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే క్యూరియాసిటిని పెంచేసి కంటెస్టెంట్స్ ఆట తీరు, గొడవలు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించాయి. ఇక బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేత, రన్నరప్‌, టాప్‌-5 కంటెస్టెంట్స్ ఎవరనేది ,విన్నర్ ప్రైజ్ మనీ ఎంత అన్నది ఆసక్తిగా మారింది. ఎప్పటి లాగే.. బిగ్‌బాస్ సండే ఎపిసోడ్ ఎలిమినేషన్, గెస్టులు, గేమ్‌లతో కలర్ ఫుల్ గా సాగిపోయింది. ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆడియెన్స్ కి కావాల్సినంత కిక్ నిచ్చింది.