దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ.. మరికొందరిని ఉన్న చోటనుంచి బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అయోధ్య రామమందిరం తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల బెంచ్ లో ఈయన ఒకరుగా ఉన్నారు. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా […]

AP NEW GOVERNER