Sri Chaitanya Jr College: సనత్‌ నగర్‌ శ్రీచైతన్య కాలేజి ముందు ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ధర్నా

ఇంటర్‌ బోర్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీ ముందు విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు. సనత్‌ నగర్‌లో ఉన్న శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీకి ఎస్‌ఎఫ్ఐ లీడర్స్‌ పెద్ద ఎత్తున చేరుకున్నారు. అధికారులకు లంచం ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు. కాలేజీ మేనేజ్‌మెంట్‌తో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు విద్యార్థి సంఘ నాయకులను లోనికి పంపేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే అధికారులు కలుగజేసుకుని కాలేజీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 15 May 2023, 3:15 PM IST

Published : 
  • 15 May 2023, 3:15 PM IST

Exit mobile version