అంబర్పేట్ శంకర్ పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ అయింది.30 ఏళ్ల పాటు ఉన్న రౌడీ షీట్ ని 2019లో పోలీసులు క్లోజ్ చేశారు. మళ్లీ ఏడేళ్ల తర్వాత మరోసారి రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఈ మధ్యకాలంలో సెటిల్మెంట్లు దండాలు ఎక్కువ అవ్వడంతో రెండు పోలీస్ స్టేషన్లో శంకర్ పై కేసు నమోదు అయింది. దీంతో రౌడీ షీట్ ఓపెన్ చేయక తప్పలేదు పోలీసులకి.హైదరాబాదులో అంబర్పేట్ శంకర్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు. దాదాపు 50 ఏళ్ల నుంచి రౌడీ షీటర్ గా ముద్ర పడిన శంకర్ అసలు పేరు చిన్న బోయిన శంకర్. మెకానిక్ గా జీవితం మొదలుపెట్టి, సింగిల్ లాటరీ ఏజెంట్‌గా పనిచేసి.... రౌడీ షీటర్ గా ముద్ర పడిన వాడు అంబర్‌పేట శంకర్. చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ లో హీరో పాత్ర శంకర్ దేనిని చెప్తారు. అలాగే డి మూవీ లో రౌడీ షీటర్ శంకర్ గౌడ్ , నాగార్జున కింగ్ లో రౌడీ షీటర్ జ్ఞానేశ్వర్ ఇవన్నీ అంబర్‌పేట శంకర్ బ్యాక్ గ్రౌండ్ తో రూపొందించిన క్యారెక్టర్ లేనని అంటారు.
అయితే నేరాలకు దూరంగా ఉంటూ అంబర్‌పేట శంకర్ ప్రవర్తనలో మార్పు రావడంతో 2019లో ఎత్తివేసిన రౌడీషీట్.. మళ్లీ తెరుచుకుంది. ఈమధ్య అతనిపై జూబ్లీహిల్స్‌తో పాటు పలు పోలీస్స్టేషన్ల పరిధిలో కొత్తగా కేసులు నమోదు కావడంతో పోలీసులు అతని కదలికలపై దృష్టిసారించారు.40 ఏళ్లకు పైగా నేరచరిత్రను పరిగణనలోకి తీసుకుని రౌడీషీట్‌ను మళ్లీ పెట్టినట్లు సమాచారం.అంబర్‌పేట శంకర్‌పై గతంలోనే రౌడీషీట్ ఉండేది. 80 లలో అంబర్పేట్ శంకర్ పై పెట్టిన రౌడీషీట్ 2019లో ఎత్తేసిన తర్వాత కొంతకాలం అతని వ్యవహారశైలి సాధారణంగానే కొనసాగింది
కానీ ఈ మధ్య పరిస్థితి మారింది. అంబర్‌పేట శంకర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌తో పాటు మరికొన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో కొత్తగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో పోలీసులు అతని నేరచరిత్రను మరోసారి పరిశీలించారు. గతంలో ఉన్న రౌడీషీట్, తాజా కేసులను పరిగణనలోకి తీసుకుని మళ్లీ రౌడీషీట్ పెట్టారు.
ఇటీవల కాలంలో పాత రౌడీలను కొంతమందిని జమచేసి శంకర్ ల్యాండ్ దాందాల్లో బానే సంపాదించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్లను, కేబుల్ ఆపరేటర్లను శంకర్ ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. నిజానికి 60 ఏళ్లు దాటిన వాళ్లపై రౌడీ షీట్ ఉంటే వయసును పరిగణలోకి తీసుకొని అది ఎత్తివేస్తారు. శంకర్ పై కూడా అందుకే రౌడీషీట్లు తీసేశారు. గడచిన మూడేళ్లుగా శంకర్ తన ఆక్టివిటీ పెంచాడు. ఫంక్షన్స్ లో పాల్గొనడంతో పాటు... కొంత పొలిటికల్ సపోర్ట్ తో కూడా మళ్లీ దండాలు స్టార్ట్ చేశాడు. శరీరం అంత సహకరించక పోయినా.... చుట్టూ గ్యాంగ్ ఫామ్ చేసి రియల్ టైలర్ బెదిరిస్తున్నట్లు సమాచారం.రౌడీషీట్ పునరుద్ధరణతో శంకర్ కదలికలపై పోలీసులు మరింత నిఘా పెట్టే అవకాశం ఉంది. ఇటీవల నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటు అతనితో సంబంధాలు కలిగిన వ్యక్తులపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు కొత్తగా ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అతని కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. అంబర్పేట్ శంకర్ గా స్థానిక బిజెపి నేతలతో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మా కేంద్ర మాజీ మంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయకు సన్నిహితుడు అంబర్‌పేట శంకర్.