స్టోక్స్ ఇంట్లో దొంగలు పడ్డారు విలువైన వస్తువులు చోరీ

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. బెన్ స్టోక్స్, పాక్ పర్యటనలో ఉన్నప్పుడు ఇంగ్లాండ్‌లోనే అతని ఇంట్లో దొంగలు పడ్డారు.. స్టోక్స్‌ ఇంట్లోకి చొరబడిన ముసుగు దొంగలు.. విలువైన ఆభరణాలు, డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు.

Post Published By: Vencateshg
Updated : 1 November 2024, 11:38 AM IST

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. బెన్ స్టోక్స్, పాక్ పర్యటనలో ఉన్నప్పుడు ఇంగ్లాండ్‌లోనే అతని ఇంట్లో దొంగలు పడ్డారు.. స్టోక్స్‌ ఇంట్లోకి చొరబడిన ముసుగు దొంగలు.. విలువైన ఆభరణాలు, డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు. దొంగలు పడిన సమయంలో ఇంట్లో బెన్ స్టోక్స్ భార్యతో పాటు వారి ఇద్దరు చిన్న పిల్లలు మాత్రమే ఉన్నారు. కత్తులతో ఆమెని బెదిరించిన దొంగలు, ఎలాంటి హానీ తలబెట్టలేదు. ఈ విషయాన్ని బెన్ స్టోక్స్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. తన ఇంటి నుంచి ఎత్తుకెళ్లిన వస్తువులు, నగలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చోరీకి గురైన వస్తువుల్లో కొన్ని తమ కుటుంబానికి ఎంతో సెంటిమెంట్‌ అనీ, వాటిని తిరిగి ఇచ్చేయాలని కోరాడు.

Published : 
  • 1 November 2024, 11:38 AM IST