భార్యకు చంద్రబాబు ఏం గిఫ్ట్ కొన్నారంటే…?

చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ సిఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ఆయన కాసేపు ముచ్చటించారు.

Post Published By: Vencateshg
Updated : 7 August 2024, 6:52 PM IST

చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ సిఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ఆయన కాసేపు ముచ్చటించారు. స్టాళ్ల లో ఉత్పత్తులను పరిశీలించి చేనేతలతో మాట్లాడిన ముఖ్యమంత్రి... స్టాల్ లో స్వయంగా రెండు చీరలు కొనుగోలు చేసారు. ఈ సందర్భంగా తన సతీమణి కోసం రెండు చీరలు సెలెక్ట్ చేసారు.

చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ రెండు చీరలు కొన్నారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీర కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి... స్టాల్ యజమానితో ముచ్చటించారు. ఈ సందర్భంగా స్టాల్ యజమాని తమకు ప్రభుత్వం అండగా నిలబడాలని వర్కర్స్ ని పెట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని అనడంతో జీఎస్టీ తగ్గిస్తా అంటూ హామీ ఇచ్చారు. ఇక తన సతీమణికి కొన్న చీర బరువుని ఆయన అడిగి తెలుసుకున్నారు.

Published : 
  • 7 August 2024, 6:52 PM IST