నాపై సీఎం కి కంప్లైంట్ చేస్తారా? తాట తీసేస్తా నా కొడకల్లారా? ఆడెవడో నా పక్కన నిలబడి ఫోటో దిగితే... ఆడికి నాకు సంబంధం అంట కడతారా?.... రంపచోడవరం మహిళా ఎమ్మెల్యే మిరియాల శిరీష నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. మహిళా ఎమ్మెల్యే తన సొంత టిడిపి పార్టీ కార్యకర్తలను తోలు తీస్తా... తాటతీస్తా.... అని బూతులు తిడుతుంటే , నియోజకవర్గాల్లో టిడిపి ఎమ్మెల్యేల బరితెగింపు ఎలా ఉందో కార్యకర్తలకి ఎమ్మెల్యేలకు మధ్య ఎంత గ్యాప్ పెరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం రంప చోడవరంలో మాత్రమే కాదు.... ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యే మిరియాల శిరీష మొదట్లో పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు కొనసాగించినా.. క్రమంగా కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే మధ్య గ్యాప్ పెరిగిపోయింది.నియోజకవర్గంలో వైసీపీ నుంచి టిడిపికి వచ్చిన కొంతమంది నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కష్టకాలం లో టిడిపి పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారిని ముందుకు తీసుకొస్తున్నారనే అసంతృప్తి కొంతమంది టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోందట.ఈ వ్యవహారంలో మహిళ ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్ పాత్రపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారిక హోదా లేకపోయినా ఆయన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లే నాయకులు, కార్యకర్తలు ముందుగా విజయ్ కుమార పర్మిషన్ ఇస్తేనే మిరియాల శిరీషను చూడడానికి వీలవుతుంది అని కొందరు వాపోతున్నారు.
రంపచోడవరం రాష్ట్రంలోనే ప్రధానమైన గిరిజన నియోజకవర్గాల్లో ఒకటి. 11 మండలాలకు విస్తరించిన ఈ కాన్స్టెన్సీలో ప్రజా సమస్యలు అనేకం. ఇలాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీష ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది పోయి రంపచోడవరం కాకుండా రాజవొమ్మంగిలో ఇల్లు ,ఆఫీసు ఏర్పాటు చేసుకుని అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఆదివాసీలు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేను , ఆమె భర్త విజయ భాస్కర్ ను కలవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఇక ఎమ్మెల్యే కార్యాలయంలోకి వెళ్లాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. సెల్ ఫోన్ బయటపెట్టి రావాలని ఆంక్షలు పెట్టారు. తీరా లోపలికి వెళ్ళితే పార్టీ సంగతి అలా ఉంచండి మా సంగతి ఏంటి అని అడుగుతున్నారట ఎమ్మెల్యే భర్త విజయ్ కుమార్. ఎమ్మెల్యే ఆఫీస్ లో రోజు ఆమెకి కార్యకర్తలకి గొడవే. ఈ రచ్చ పడలేక చాలామంది కొందరు కార్యాలయానికి వెళ్లడమే తగ్గించుకున్నారు. ఏ చిన్న విషయంలోనైనా ఎమ్మెల్యే మిరియాల శిరీష, ఆమె భర్త విజయ్ కుమార్.... బూతులతో కార్యకర్తల మీద పడిపోతూ ఉంటారు.
శిరీష వ్యవహారం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెవిలో వేశారు ఒకరిద్దరు పార్టీ ముఖ్యులు. ముఖ్యమంత్రి శిరీష అని పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంటింటికి తెలుగుదేశం వంటి కార్యక్రమాల్లో కొన్నిచోట్ల ఎమ్మెల్యే పాల్గొనలేదు. పార్టీని విస్తరించాల్సిన సమయంలో వర్గ విభేదాలు పెరగడం తో స్థానిక నాయకత్వం ఆందోళన చెందుతోంది.సీనియర్ నాయకులను కలుపుకొని వెళ్లాలని అధిష్టానం నుంచి వచ్చిన సూచనలు ఎమ్మెల్యే శిరీష లెక్క చేయడం లేదు. మనకు ఇంకా గట్టిగా మూడేళ్లు ఉంది ఎంత పిండుకోగలిగితే అంత పిండుకోవాలి అన్న ఫార్ములా పైనే భార్యాభర్తలిద్దరూ ఆయన కాడికి కొట్టేస్తున్నారని టాక్. ఈ పరిస్థితుల్లో అడ్డతీగల టీడీపీ అంతర్గత సమావేశం లో కార్యకర్త ఏదో మాట్లాడాలని లేస్తే బూతులతో రెచ్చిపోయారు ఎమ్మెల్యే శిరీష.
రంపచోడవరం ఒకప్పుడు టీడీపీకి బలమైన నియోజకవర్గం. మధ్యలో కాంగ్రెస్, వైసీపీ విజయాలు సాధించినా... 2024లో కూటమి ప్రభంజనంతో మళ్లీ అక్కడ టీడీపీ జెండా ఎగిరింది.అయితే అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ఎమ్మెల్యే శిరీషపై అసంతృప్తి సెగలు రగిలిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీనిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే శిరీష పై అవినీతి ఆరోపణలు, ప్రతి విషయంలో ఆమె భర్త విజయ్ కుమార్ జోక్యం రంపచోడవరం టీడీపీలో అసంతృప్తి స్వరాలను పెంచేసెయ్. కార్యకర్తల అసంతృప్తితో స్థానిక స ఎన్నికల్లో పార్టీ గోవిందా అంటున్నారు జనం.