

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య పేరు మార్మొగుతుంది. ఎక్కడ చూసినా రామ నామ జపపమే వినిపిస్తోంది.



అయోధ్య ఆలయ నిర్మాణంకు పునాధులు తీస్తున్న చిత్రం



యావత్ దేశ ప్రజలు ఎంతో ఆత్రుతగా.. భక్తితో ఎదురు చూస్తోన్న దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు జనవరి 22న తెర పడనుంది. అయోధ్య రామ మందిర నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.



జనవరి 22, అనగా సోమవారం మధ్యాహ్నం నాడు నరేంద్ర ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.



ఈ ఘట్టాన్ని స్వయంగా తిలకించేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలే కాక.. విదేశాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలి రానున్నారు.



ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు యోగి సర్కారు చర్యలు తీసుకుంటుంది.



ఈ క్రమంలో ప్రస్తుతం అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంత ఖర్చయ్యింది



ప్రపంచ వ్యాప్తంగా రామ మందిర నిర్మాణం కోసం దేశ, విదేశాల నుంచి నిధులు సేకరించారు. అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలిచ్చారు.



అయోధ్యలో 2020లో రామ మందిరానికి శుంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత.. ఆలయ నిర్మాణం కోసం విరాళాలను సేకరించాలని నిర్ణయించారు.



గర్భాలయం గోపురం..



2021లో 44 రోజుల పాటు విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది.



ఇక కేవలం విరాళాల రూపంలోనే సుమారు రూ. 2,100 కోట్లను సేకరించినట్టు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు.



వాస్తవంగా అయితే విరాళాల రూపంలో కేవలం రూ. 1000 కోట్లు వస్తాయని ట్రస్ట్ అంచనా వేసింది. కానీ.. అంచనాలకు మించి, మరో రూ. 1,100 కోట్లు అధికంగా వచ్చాయి.



అయితే విరాళాల సేకరణకు గడువు ముగిసిన తర్వాత కూడా భారీ ఎత్తున నిధులు వచ్చాయని.. ప్రస్తుతం అవి 3 వేల కోట్ల రూపాయాలకు పైగానే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.



అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రజలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది కానీ.. ప్రభుత్వం నుంచి మాత్రం ఆలయ నిర్మాణానికి పెద్దగా నిధులు ఇవ్వలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.





మందిర నిర్మాణానికి జనాల నుంచి సేకరించిన విరాళాలు మాత్రమే కాక కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది.



కొన్ని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు.. రామ మందిర నిర్మాణంలో తమ వంతు తోడ్పాటు అందించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.



పలు సంస్థలు.. ఆలయ నిర్మాణానికి సంబంధించి అనేక రకాల పరికరాలు, సామాగ్రి ఇచ్చినట్టు సమాచారం.



రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఖర్చులపై ట్రస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కానీ.. లెక్కలు కానీ బయటకు రాలేదు. కాగా ఆలయ నిర్మాణానికి రూ. 1,800 కోట్లు ఖర్చు అవుతుందని తొలుత అంచనా వేశారు.



గర్భాలయం లో పనులను పరీశీలీస్తున్న యూపీ సీఎం యోగి.



నిర్మాణం, యంత్రాలు, ముడిసరుకు, కార్మికులు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులన్ని కలుపుకుని ఈ మొత్తాన్ని అంచనా వేశారు.



నిర్మాణ ఇటుక పై శ్రీరామ నామం



ఆలయ గోడలను మొక్కుతున్న రామ భక్తులు



ప్రధాన.. విగ్రహాలకోసం నేపాల్ నుంచి తీసుకోచ్చిన బండ రాతి బండలు



నేపాల్ లో చాలా అరుదుగ దోరికే బండ రాతులు



అయితే నిర్మాణం మొదలయ్యాక ఖర్చులు భారీగా పెరిగాయని.. ఇప్పటి వరకు సుమారు రూ. 3,200 కోట్ల వరకు ఖర్చు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు దీనిపై స్పష్టత రాదు.



ఆలయ నిర్మాణ కార్మీకులు



2023 అక్టోబర్ నాటికి.. విరాళాల రూపంలో మందిర నిర్మాణానికి లభించిన మొత్తం డబ్బుల్లో రూ. 900 కోట్లు ఖర్చు అయ్యాయని.. మరో రూ. 3వేల కోట్లు బ్యాంక్ ఖాతాల్లో ఉన్నట్టు ట్రస్ట్ సభ్యుల్లో ఒకరు వెల్లడించారు.



ఈ రూ. 900 కోట్లు ఆలయ నిర్మాణానికి మాత్రమే ఖర్చైనట్టు తెలిపారు.



ట్రస్ట్ ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిన వాటిల్లో ముందు వరుసలో ఉండేది.. ఆలయ నిర్మాణం.



తర్వాతి ఖర్చు.. అదనపు భూమిని కొనుగోలు చేయడం, దానిని అభివృద్ధి చేయడానికి అవుతుంది అంటున్నారు.



మందిర ప్రారంభోత్సవం తర్వాత.. ప్రతియేటా లక్షలాది మంది అయోధ్యను సందర్శిస్తారు. కాబట్టి.. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి.



ఉద్యోగుల వేతనాలు, రవాణా, సమాచార వ్యవస్థ, ఆపరేటింగ్ కాస్ట్లు ప్రతియేటా ఉంటూనే ఉంటాయి. వీటన్నింటికి కూడా భారీగా ఖర్చు అవుతాయని భావిస్తున్నారు.



130 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.





24 గంటల పాటు పని చేయడం, దేశం నలుమూలల నుండి వచ్చిన నైపుణ్యం కలిగిన నైపుణ్యం, ఆ ప్రాంతంలోని ప్రత్యేక సాధనాలు రాముడి ఆలయాన్ని నిలబెట్టాయి.





రామాలయం ప్రాంగణం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఉంటుంది.



ఆలయ విస్తీర్ణం మొత్తం 67 ఎకరాలు. అసలు ఆలయం 2 ఎకరాల స్థలంలో ఉంది. గర్భగుడితో పూర్తి అయిన ఆలయం మొత్తం 3 మాలలను కలిగి ఉంటుంది.



ఒక్కో దండ ఎత్తు 20 అడుగులు. ఆలయ గర్భగుడి ఈ ప్రధాన శిఖరం కింద ఉంటుంది.



జనవరి 20న అక్షత ఉత్సవం, జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది.



ప్రాణ్ ప్రతిష్ట కోసం, 22 జనవరి 12:29 సమయం నిర్ణయించారు.



దీని తర్వాత వచ్చే 48 రోజుల పాటు మండల పూజ నిర్వహిస్తారు.



రానున్న 7 నుంచి 8 నెలల్లో ఆలయ ప్రాంతంలో ఏడు వేర్వేరు ఆలయాలు నిర్మించనున్నారు.



ఇందులో మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాద్ రాజ్, శబ్రీ, అహల్య, జటాయువుల ఆలయాలు ఉంటాయి.



అయోధ్య ఆలయం ముందు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి
