నువ్వు ఎవడ్రా…? చెవిరెడ్డిపై బాలినేని ఫైర్

తనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన విమర్శలపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒక చోటా నాయకుడు అంటూ మండిపడ్డారు.

Post Published By: Vencateshg
Updated : 25 November 2024, 1:35 PM IST

తనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన విమర్శలపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒక చోటా నాయకుడు అంటూ మండిపడ్డారు. జగన్ కాళ్ళు పట్టుకున్న వ్యక్తి చెవిరెడ్డి అని ఎద్దేవా చేసారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కాకుండా చెవిరెడ్డికి ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు అని నిలదీశారు. కేవలం చెవిరెడ్డి మాదిరి భజన చేయలేదనే ఆయనకు సీట్ ఇవ్వలేదు అని ఆయన నిలదీశారు.

ఎక్కడో చిత్తూరు నుంచి చెవిరెడ్డి ని తెచ్చి మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. చెవిరెడ్డి నన్ను కామెంట్ చేసేంతటి వాడా ? అంటూ మండిపడ్డారు. నేను జగన్ పార్టీ పెట్టినప్పుడు నేను మంత్రి పదవి వదిలి వచ్చి పార్టీలో చేరానన్న బాలినేని... చెవిరెడ్డి అమెరికా వెళ్లి ఏమి చేస్తున్నాడో నేను గుట్టు విప్పితే పరువు పోతుందన్నారు. విద్యుత్ ఒప్పందాలపై నేను సంతకం పెట్టలేదు కేవలం కేబినెట్ కి మాత్రమే పంపానని తెలిపారు.

అదాని ఒప్పందం కేబినెట్ తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేసారు. నేను ఒక్కరూపాయి కూడా ముడుపులు తీసుకోలేదని ఆయన స్పష్టం చేసారు. చెవిరెడ్డికి దమ్ముంటే పబ్లిక్ చర్చకు రమ్మని చెప్పండని సవాల్ చేసారు. ఆదానితో ఒప్పందానికి నాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అప్పటి సెక్రటరీ నాగులపల్లి శ్రీకాంత్ చెబితే ఆయన మీద నమ్మకంతో కేబినెట్ కి ఫైల్ పంపమని చెప్పానన్న ఆయన నా డిజిటల్ సైన్ ఇంకోసారి వాళ్ళు ఏదైనా చేస్తారేమోనని అనుమానంగా ఉందని వ్యాఖ్యలు చేసారు.

Published : 
  • 25 November 2024, 1:35 PM IST