BANDI SANJAY: బండి సంజయ్‌కు ఊహించని షాక్.. కరీంనగర్‌లో సొంత పార్టీ నేతల తిరుగుబాటు
కరీంనగర్ కమలం పార్టీలో కలకలం రేగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్లు బండిపై తిరుగుబాటుకు దిగారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సంజయ్‌కి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో దాదాపు వంద మంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.