2024లో కేంద్రంలో తిరిగి అధికారమే లక్ష్యంగా సమూల మార్పులకు దిగారు జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా. వెనకబడిన తరగతిగా చెప్పుకొనే పాస్మాండ ముస్లిం వర్గానికి చెందిన తారిఖ్ మన్సూర్‌కు ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళా నేత లతా ఉసేండికి, బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు ఇచ్చింది.
