BRS: బీఆర్ఎస్‌లో పెరుగుతున్న అసంతృప్తుల జాబితా.. పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న సీనియర్లు..?
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. తనకు అధిష్టానం పాలేరు సీటు కేటాయిస్తుందని భావించారు. అయితే, జాబితాలో తన పేరు లేకపోవడంతో త్వరలోనే రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోబోతున్నారు.