“ఇంత బతుకు బతికి ఇంటి వెనుక నూతిలో పడ్డట్టు” ఈ మాట బెజవాడకు సరిగా సరిపోతుంది ఇప్పుడు. బెజవాడ చరిత్రలో… ఇంత మంది ప్రజలు వరద దెబ్బకు రోడ్డున పడిన పరిస్థితి ఎన్నడూ లేదు. బుడమేరు ఇప్పుడు కష్టాల మేరు, కన్నీటి మేరు, విషాద మేరు.