Kesineni Nani: చంద్రబాబు వెంటే కేశినేని నాని.. పార్టీ మార్పు నిర్ణయం మార్చుకున్నారా..?

తీర్పు కోసం బాబు వెయిట్‌ చేస్తున్న టైంలో కూడా నాని ఆయన పక్కనే కూర్చున్నారు. దీంతో కేశినేని పార్టీ మారబోతున్నారు అంటూ వచ్చిన పుకార్లకు చెక్‌ పడినట్టైంది.

Post Published By: narender Thiru
Updated : 10 September 2023, 6:32 PM IST

Kesineni Nani : చంద్రబాబు అరెస్ట్‌లో ఏపీ రాజకీయాలు హాట్‌ హాట్‌గా మారాయి. ఉదయం నుంచి విజయవాడలోని సీబీఐ కోర్టు ప్రాగంణంలో అనుక్షణం ఉత్కంఠ నెలకొంది. అయితే రాజకీయంగా ఓ అద్భుతమైన సీన్‌ కనిపించింది. ఉదయం చంద్రబాబు కోర్టుకు వచ్చినప్పటి నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆయనతోనే ఉన్నారు.

ఏదో జస్ట్‌ కలిసి వెళ్లిపోడానికి వచ్చారని అంతా అనుకున్నా.. నాని మాత్రం కోర్టు తీర్పు వచ్చేవరకూ చంద్రబాబుతో ఉన్నారు. తీర్పు కోసం బాబు వెయిట్‌ చేస్తున్న టైంలో కూడా నాని ఆయన పక్కనే కూర్చున్నారు. దీంతో కేశినేని పార్టీ మారబోతున్నారు అంటూ వచ్చిన పుకార్లకు చెక్‌ పడినట్టైంది. కొన్ని రోజుల నుంచి కేశినేని పార్టీ మారబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. ఆల్రెడీ వైసీపీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారని.. ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి వైసీపీలోకి వెళ్లేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నారంటూ చాలా మంది మాట్లాడుకున్నారు.

వీటికి తగ్గట్టుగానే చంద్రబాబుతో నానికి చాలా కాలంగా గ్యాప్‌ కనిపించింది. చంద్రబాబు కూడా నానికంటే ఆయన సోదరుడికే ఇటీవల కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో ఉన్న నాని.. నిజంగానే ఆయన పార్టీ మారుతున్నారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉదయం నుంచి చంద్రబాబుతోనే ఉండి తాను పార్టీ మారడంలేదని చెప్పకనే చెప్పేశారు నాని. కోర్టు విచారణ, తీర్పు సందర్భంగా పూర్తిగా నాని చంద్రబాబు వెంటే ఉండటం విశేషం.

Published : 
  • 10 September 2023, 6:32 PM IST