జగన్ పుట్టక ముందే కాంగ్రెస్ పార్టీ ఉంది: షర్మిల

ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ పై ఆయన సోదరి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 1.7 ఓట్లు వచ్చిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని జగన్ విమర్శించడాన్ని షర్మిల తప్పుబట్టారు.

Post Published By: Vencateshg
Updated : 14 November 2024, 12:52 PM IST

ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ పై ఆయన సోదరి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 1.7 ఓట్లు వచ్చిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని జగన్ విమర్శించడాన్ని షర్మిల తప్పుబట్టారు. ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ ఇవ్వాళ వైసీపీనే అంటూ ఆమె ఎద్దేవా చేసారు. ప్రజలు మిమ్మల్ని ఓడించాలని కూటమికి ఓట్లు వేశారు అన్నారు. మీకు 11 సీట్లు వచ్చినా..38 శాతం వచ్చినా అసెంబ్లీ వెళ్ళలేదని ఎద్దేవా చేసారు.

మాకు సీట్లు రాక మేము అసెంబ్లీ వెళ్ళలేదన్న ఆమె... మీకు మాకు ఏంటి తేడ ఏముంది అని నిలదీశారు. జగన్ పుట్టక ముందు నుంచే ఉంది కాంగ్రెస్ పార్టీ అంటూ షర్మిల ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదు అన్నారు ఆమె. కాగా బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే.

Published : 
  • 14 November 2024, 12:52 PM IST