ఆంధ్రప్రదేశ్ లో మరో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఇటీవల మూడు స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎవరిని పంపిస్తారు అనేదానిపై పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి.
