Maldivian : అసలేంటి పంచాయితీ.. మాల్దీవ్‌ను బాయ్‌ కాట్‌ చేయాల్సిందేనా..?

కొంతకాలంగా వీక్‌ అవుతూ వస్తున్న భారత్, మాల్దీవుల బంధం.. ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లడం.. అక్కడ ఆయన వ్యాఖ్యలపై.. మాల్దీవుల మంత్రి కౌంటర్​ వేశారు. దీంతో కొత్త వివాదం మొదలైంది. అది కాస్త చినికిచినికి గాలివానలా తయారవుతోంది. మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయ్. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ అంటూ నెటిజన్లు మారాయి. ఈ మధ్య ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లారు. అక్కడి పర్యాటక రంగాన్ని కొత్త జోష్‌ నింపేలా నాలుగు మాటాలు మాట్లాడారు. ముఖ్యంగా స్నార్కెలింగ్‌.. అంటే సముద్ర అడుగు భాగంలో ఈత కొట్టే సాహనం గురించి ప్రత్యేకంగ ప్రస్తావించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 January 2024, 6:17 PM IST

Published : 
  • 7 January 2024, 6:17 PM IST

Exit mobile version