Chandrayaan-3: చంద్రుడికి చేరువగా చంద్రయాన్-3.. జాబిల్లిని అతి దగ్గరగా తీసిన వీడియో విడుదల
చంద్రయాన్-3లో కీలకమైన కక్ష్య కుదింపు చర్య ఆదివారం రాత్రి విజయవంతంగా పూర్తైంది. వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండించడం ద్వారా శాస్త్రవేత్తలు కక్ష్యను కుదించగలిగారు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం వెల్లడించారు.