Swiggy-Biryani: బిర్యానీకి మరోసారి హైదరాబాదీల ఫిదా.. స్విగ్గీలో రోజుకు 21 వేల బిర్యానీ ఆర్డర్లు
ఈ సంవత్సరం సగటున 1 సెకన్‌కు 2.5 బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయి. జనవరి నెలలో ఏకంగా నాలుగు లక్షల 30 వేల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 23 వరకు 2.49 మిలియన్ల మంది కస్టమర్లు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేశారు.