సన్ రైజర్స్ లోకి చిచ్చర పిడుగు…యంగ్ పేసర్ అంబరీష్ కు చోటు…!

ఐపీఎల్ 19వ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. భారీ విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా అయిదు విజయాలతో తన సత్తా చాటింది. మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ ను వాళ్ల సొంత గడ్డ వాంఖెడే స్టేడియంలో చితగ్గొట్టడం అదరహో అనిపించుకుంది.

Post Published By: dialnews
Updated : 2 May 2026, 3:00 PM IST

ఐపీఎల్ 19వ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. భారీ విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా అయిదు విజయాలతో తన సత్తా చాటింది. మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ ను వాళ్ల సొంత గడ్డ వాంఖెడే స్టేడియంలో చితగ్గొట్టడం అదరహో అనిపించుకుంది. ఈ మ్యాచ్ లో ఓడిన దెబ్బకు ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. ప్లేఆఫ్స్ పై దాదాపుగా   ఆశలువదులుకున్నట్టయింది.ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ ఆరింట్లో నెగ్గింది. మూడింట పరాజయాన్ని చవి చూసింది. మొత్తం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా అయిదు మ్యాచ్ లు ఆడాల్సి ఉందీ జట్టుకు ఇందులో ఇంకో మూడు గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయపడ్డ శివం మావి స్థానంలో 18 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆర్‌ఎస్ అంబరీష్‌ ఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో వేలంలో 75 లక్షల రూపాయల ధరకు శివం మావిని జట్టులోకి తీసుకుంది. అతను గాయం కారణంగా టోర్నమెంట్‌ మొత్తానికీ దూరం అయ్యాడు. దీంతో ఆర్ఎస్ అంబరీష్ తో అతని స్థానాన్ని భర్తీ చేసింది. కుడిచేతి మీడియం పేసర్, ఎడమచేతి బ్యాటర్ అయిన అంబరీష్ 2026 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఆ టోర్నమెంట్‌లో 11 వికెట్లతో అతను టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్నాడు.

తమిళనాడు క్రికెటర్ జాయింట్ హయ్యెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ బౌలింగ్ యంగ్ పేసర్లతో మంచి జోరు మీదుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో అద్భుతంగా ప్రఫుల్ హింగ్, సాకిబ్ హుస్సేన్ అద్భుతంగా రాణిస్తున్నారు . అంబరీష్ ఇప్పుడు వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నాడు. సన్ రైజర్స్ తన తర్వాతి మ్యాచ్ లో ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఇప్పటికే సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్ లలోనూ గెలిచిన ఆరెంజ్ ఆర్మీ కేకేఆర్ ను కూడా ఓడించి జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది.

Published : 
  • 2 May 2026, 3:00 PM IST