సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొంది, స్వర్ణ పతకాలు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులకు పరిమితమైంది.
