భారత్ లో కివీస్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్ట్

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ చేరుకుంది. అయితే భారత్ తో ఆడేందుకు కాదు.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఇక్కడకు వచ్చింది.

Post Published By: Vencateshg
Updated : 5 September 2024, 3:20 PM IST

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ చేరుకుంది. అయితే భారత్ తో ఆడేందుకు కాదు.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఇక్కడకు వచ్చింది. ఎందుకంటే ఆప్ఘనిస్తాన్ భారత్ ను తమ తటస్థ వేదికగా ఉపయోగించుకుంటోంది. ఈ కారణంగానే కివీస్ తో చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ గ్రేటర్ నోయిడాలో ఆడబోతోంది. దీని కోసం గత వారమే భారత్ చేరుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రాక్టీస్ లో బిజీగా ఉంటే...ఇప్పుడు కివీస్ జట్టు కూడా వచ్చింది. కెప్టెన్ టిమ్ సౌథీ నేతృత్వంలోని న్యూజిలాండ్ జ‌ట్టు శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెడుతుంది. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జరిగే ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ కివీస్‌కు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.

Published : 
  • 5 September 2024, 3:20 PM IST