ముంబై కెప్టెన్ గా రోహిత్ ? కొత్త ప్లాన్ రెడీ చేస్తున్న ఫ్రాంచైజీ.!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ తన అభిమానులను చాలా దారుణంగా నిరాశపరిచింది. టోర్నీ ముగియక ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేస్తారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Post Published By: dialnews
Updated : 28 July 2026, 5:48 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ తన అభిమానులను చాలా దారుణంగా నిరాశపరిచింది. టోర్నీ ముగియక ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేస్తారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్, కో‌ల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఫ్రాంచైజీలు ముందు వరుసలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడితే.. ఆ జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడుతుంది. ది హండ్రెడ్ 2026' టోర్నీకిముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ హాజరయ్యారు. జట్టుకు మద్దతు ఇచ్చేందుకు రోహిత్ శర్మ కూడా ఓవల్‌కు వచ్చారు. నీతా అంబానీ, రోహిత్ శర్మ కలిసి మ్యాచ్ వీక్షించారు. దీంతో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిరిగి ఎన్నుకోవచ్చనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా రోహిత్ శర్మ లండన్‌లోనే ఉండిపోయాడు.రోహిత్ శర్మను తొలగించి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మూడు సీజన్లలో జట్టు ఒకసారి 10వ స్థానంలో, మరోసారి 9వ స్థానంలో నిలిచింది. హార్దిక్ హయాంలో సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే సూర్యను టీమిండియా నుంచి తొలగించారు . సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అతను గత సీజన్‌లో ఒక మ్యాచ్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ముంబై ఇండియన్స్‌కు తిలక్ వర్మ రూపంలో కూడా ఒక ఆప్షన్ ఉంది, కానీ కొంతకాలంగా తిలక్ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలకంగా కనిపిస్తున్నాడు.ఐపీఎల్‌లో రోహిత్ శర్మను కెప్టెన్ గా తిరిగి తీసుకురావడం తప్ప ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి మరో మార్గం లేనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ.. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డేలో సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2026లో గాయం కారణంగా రోహిత్ శర్మ కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ మ్యాచ్‌లలో రోహిత్ శర్మ 157 స్ట్రైక్ రేట్‌తో 283 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ 5 ఐపీఎల్ టైటిళ్లను గెలిచాడు.

Published : 
  • 28 July 2026, 5:48 PM IST