డ్రెస్సింగ్ రూంలో సిగరెట్… చిక్కుల్లో రియాన్ పరాగ్…!

ఐపీఎల్ లో ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్‌ జోరుకు బ్రేకులు పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి చవి చూసిందీ ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ కేప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు

Post Published By: dialnews
Updated : 30 April 2026, 11:20 AM IST

ఐపీఎల్ లో ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్‌ జోరుకు బ్రేకులు పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి చవి చూసిందీ ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ కేప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతను వాపింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ అయింది. అప్పటికే ఔట్ అయిన ధ్రువ్ జురెల్, యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్‌లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. ఈ సమయంలో పరాగ్.. ఈ-సిగరెట్ తాగతూ కనిపించాడు. ఇది వివాదానికి తెరలేపింది.స్టేడియంలలో ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి బీసీసీఐ కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తుంది గానీ అందులో వాపింగ్ కు సంబంధించిన నియమాలు పొందుపర్చలేదు.

ఆరోగ్యం, భద్రతా ప్రోటోకాల్‌ల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్‌లు లేదా డగౌట్‌లలో పొగాకు లేదా సంబంధిత ఉత్పత్తుల వాడకంపై నిషేధం ఉంది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం 2019 కింద పరాగ్‌పై శిక్ష పడే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి భారీగా ఫైన్ పడుతుంది. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.ఇది ఇ-సిగరెట్ కావడం వల్ల బీసీసీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. స్మోకింగ్ గానే పరిగణిస్తే రియాన్ పరాగ్‌కు శిక్ష పడొచ్చు.

ఈ సీజన్ లో రియాన్ పరాగ్ పెద్దగా ఆడట్లేదు. సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిన తర్వాత అతని స్థానాలో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన పరాగ్ 107 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో నిలకడ కోల్పోయాడు. విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతకుముందు ఏప్రిల్ 10న గువాహతి స్టేడియంలో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు ఆర్ఆర్ టీమ్ మేనేజర్ రోమి భిందర్‌కు లక్ష జరిమానా పడింది. . ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 222/4 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఇదే తొలి ఓటమి.

Published : 
  • 30 April 2026, 11:20 AM IST