ఈ మ్యాచ్ ఖచ్చితంగా సన్ రైజర్స్ బ్యాటింగ్‌కు, కోల్‌కతా బౌలింగ్‌కి మధ్య సమరంగా చెప్పుకోవాలి. గతంలో ఈ రెండు జట్లు తలపడ్డ మ్యాచుల్లో కేకేఆర్ జట్టుదే పైచేయి. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు 23 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో నైట్ రైడర్స్ 15 మ్యాచుల్లో గెలవగా, సన్ రైజర్స్ జట్టు ఎనిమిదింట నెగ్గింది.
