ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికినప్పటి నుంచి వారి స్థానాలను భర్తీ చేసే వారి కోసం టీమ్ ఇండియా వెతుకుతూనే ఉంది. ఇప్పుడు కేఎల్ రాహుల్ తన అనుభవంతో భర్తీ చేస్తాడని భావిస్తున్నా. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన కేఎల్ తప్పకుండా ఐదో స్థానంలో సరిపోతాడనిపిస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
