ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి, చివరి మెట్టుపై బోల్తా పడ్డ పంజాబ్ కింగ్స్ .. ఐపీఎల్ 2026లోనూ మంచి ఆరంభం అందుకుంది. తొలి అర్ధభాగంలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. తొలి ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించింది.