పంత్ అంటే అలాగే ఉంటది వికెట్ల వెనుక సందడే సందడి

రిషబ్ పంత్ రీఎంట్రీ తర్వాత మునుపటిలానే బ్యాటింగ్ చేయడమే కాదు వికెట్ల వెనుక అదరగొడుతున్నాడు.తాజాగా దులీప్ ట్రోఫీలోనూ వికెట్ల వెనుక హల్ చల్ చేస్తున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 9 September 2024, 10:05 AM IST

రిషబ్ పంత్ రీఎంట్రీ తర్వాత మునుపటిలానే బ్యాటింగ్ చేయడమే కాదు వికెట్ల వెనుక అదరగొడుతున్నాడు.తాజాగా దులీప్ ట్రోఫీలోనూ వికెట్ల వెనుక హల్ చల్ చేస్తున్నాడు. తన జట్టులో ఆటగాళ్ళను ప్రోత్రహిస్తూనే క్రీజులో ఉన్న బ్యాటర్లతో జోకులు వేస్తూ నవ్విస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేస్తుండగా...బౌలర్ తో సింగిల్ తీసుకోని...అతని కోసం ప్లాన్ సెట్ చేసానంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై కుల్దీప్ కామ్ గా ఉండు అంటూ రియాక్ట్ అయ్యాడు. అయితే ఔట్ అవ్వొచ్చుగా అంటూ కుల్దీప్ ను టీజ్ చేశాడు. స్టంప్స్ లో ఉన్న కెమెరాలో ఈ సంభాషణ అంతా రికార్డవగా.. సోషల్ మీడియాలో వైరల్ మారింది. పంత్ వికెట్ల వెనుక ఉంటే ఇలాగే సరదాగా ఉంటుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Published : 
  • 9 September 2024, 10:05 AM IST