జైషా వారసుడెవరు ? రేసులో ఉన్నది వీళ్ళే
బీసీసీఐ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్ గా ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా నామినేషన్ వేయకపోయినప్పటకీ ఐసీసీలోకి వెళ్ళేందుకు జైషా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ జై షా ఐసీసీ చైర్మన్గా ఎన్నికైతే తర్వాతి బీసీసీఐ సెక్రెటరీ ఎవరనే దానిపై చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ పోటీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. […]