త్వరలోనే రిటైర్మెంట్ సైనా చెప్పిన కారణమిదే

భారత బ్యాడ్మింటన్ కు క్రేజ్ తీసుకొచ్చిన క్రీడాకారిణి సైనానెహ్వాల్...ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తొలి భారత షట్లర్..సైనా అద్భుతమైన విజయాలతో చాలా మంది అమ్మాయిలు షటిల్ రాకెట్ పట్టారు.

Post Published By: Vencateshg
Updated : 2 September 2024, 6:45 PM IST

భారత బ్యాడ్మింటన్ కు క్రేజ్ తీసుకొచ్చిన క్రీడాకారిణి సైనానెహ్వాల్...ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తొలి భారత షట్లర్..సైనా అద్భుతమైన విజయాలతో చాలా మంది అమ్మాయిలు షటిల్ రాకెట్ పట్టారు. అయితే గత కొంతకాలంగా సైనా విజయాల్లో వెనుకబడిపోయింది. గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బందిపడుతోంది. తాజాగా రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే ఆటకు వీడ్కోలు పలకడంపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించింది. కీళ్లనొప్పులతో ఇబ్బందిపడుతున్నట్టు చెప్పిన సైనా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయలేకపోతున్నానని తెలిపింది. అత్యుత్తమ స్థాయి ప్లేయర్స్ తో తలపడేందుకు ఈ ప్రాక్టీస్ సరిపోదని వ్యాఖ్యానించింది. సుదీర్ఘకాలం దేశానికి ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని సైనా చెప్పింది.

Published : 
  • 2 September 2024, 6:45 PM IST

Topics :