వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ నిర్వహణ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కిందా మీదా పడుతోంది. నిధులను ఏదో విధంగా సమకూర్చుకుని స్టేడియాలను ఆధునీకరిస్తూ టోర్నీని గ్రాండ్ గా నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే స్టేడియాల మరమ్మత్తు పనులను కూడా ప్రారంభించింది. అయితే పాక్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చేలా కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి.
