2026 IPL మనదేనమ్మా…?

భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయమైన పేరు ఏదైనా ఉందంటే అది శుభ్‌మన్ గిల్. క్లాసిక్ బ్యాటింగ్ స్టైల్‌తో, మైదానం నలుమూలలా షాట్లు ఆడగల సామర్థ్యం ఉన్న ఈ యువ ఆటగాడిని అభిమానులు ముద్దుగా ‘ప్రిన్స్’ అని

Post Published By: dialnews
Updated : 17 March 2026, 1:41 PM IST

భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయమైన పేరు ఏదైనా ఉందంటే అది శుభ్‌మన్ గిల్. క్లాసిక్ బ్యాటింగ్ స్టైల్‌తో, మైదానం నలుమూలలా షాట్లు ఆడగల సామర్థ్యం ఉన్న ఈ యువ ఆటగాడిని అభిమానులు ముద్దుగా ‘ప్రిన్స్’ అని పిలుచుకుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేదికగా గిల్ సృష్టించిన ప్రభంజనం సామాన్యమైంది కాదు. తక్కువ కాలంలోనే అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో ఒకరిగా నిలిచిన గిల్ కెరీర్ గణాంకాలను పరిశీలిస్తే, అతను భవిష్యత్ లెజెండ్ అని చెప్పక తప్పదు. ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్‌లో గిల్ సాధించిన ఘనతలు అతని నిలకడకు నిదర్శనం. ప్రధానంగా గుజరాత్ టైటాన్స్ జట్టుకు సారథ్యం వహిస్తూ, బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్న గిల్ పేరిట రికార్డులు ఎన్నో ఉన్నాయి.

188 మ్యాచుల్లో దాదాపు 40 ‌సగటు కలిగి ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో 39 పైచిలుకు సగటు ఉండటం అనేది గొప్ప విషయం. గిల్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ తో ప్రారంభించాడు. అక్కడ ఓపెనర్‌గా తనదైన ముద్ర వేసినప్పటికీ, గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వచ్చిన తర్వాత గిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ముఖ్యంగా 2023 సీజన్‌లో అతను చేసిన పరుగులు, సాధించిన సెంచరీలు ఐపీఎల్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. హార్దిక్ పాండ్యా నిష్క్రమణ తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు పగ్గాలను గిల్ అందుకున్నాడు. బ్యాటర్‌గా పరుగుల వరద పారిస్తూనే, జట్టును ముందుండి నడిపించడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడం గిల్ ప్రత్యేకత.

మొత్తం 26 అర్థ సెంచరీలు, 4 సెంచరీలతో తన సత్తా చాటుతున్నాడు ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. మిగతా పవర్ హిట్టర్లలా గిల్ కేవలం బలాన్ని నమ్ముకోడు. అతను టైమింగ్‌పై ఆధారపడతాడు. అతని 'కవర్ డ్రైవ్' మరియు 'పుల్ షాట్స్' చూడటానికి రెండు కళ్లు సరిపోవు. 138.72 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూనే, వికెట్ పడకుండా జాగ్రత్త పడటం గిల్‌కు మాత్రమే సాధ్యమైన విద్య. కేవలం 25 ఏళ్ల లోపే 4 ఐపీఎల్ సెంచరీలు బాదిన గిల్, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం. విరాట్ కోహ్లీ తర్వాత భారత క్రికెట్ వారసత్వాన్ని మోసే సత్తా గిల్‌కు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్‌లో 3866 పరుగులు సాధించిన ఈ యువకిశోరం త్వరలోనే 5000 పరుగుల మైలురాయిని చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Published : 
  • 17 March 2026, 1:41 PM IST