భువనేశ్వర్ కుమార్ 36 ఏళ్ల వయస్సులో తన పాత ఫామ్‌ని తిరిగి తీసుకొస్తున్నాడు. క్రికెట్ ఆరంభ రోజుల్లో ఎలాంటి స్వింగ్‌తో భయపెట్టాడో.. ఇప్పుడు కూడా అలాంటి బంతులే వేస్తూ భువీ ఈజ్ బ్యాక్ అనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో వికెట్ల ఫటాఫట్ అని తీస్తూ ఇప్పటికే పర్పుల్ క్యాప్‌ను పలుమార్లు సొంతం చేసుకున్న భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు తాజాగా మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.టీమిండియా తరఫున 350 టీ 20 వికెట్లు తీసుకున్న తొలి పేసర్‌గా భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ భారత పేసర్ కూడా ఈ రికార్డును అందుకున్నాడు. టీ20, ఐపీఎల్ ఇలా అన్నింటిలో కలిపి భువనేశ్వర్ కుమార్ 350 వికెట్లు తీసుకున్నాడు.
ఐపీఎల్ ఒక్క ఫార్మాట్‌లో అయితే 215 వికెట్లు పడగొట్టగా, టీ20ల్లో 90 వికెట్లు తీసుకున్నాడు.టీ20 ఇంటర్నేషన్ క్రికెట్‌లో అయితే టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ 127 వికెట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంటే.. జస్ప్రీత్ బుమ్రా 121 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 114, అక్షర్ పటేల్ 97, యుజ్వేంద్ర చాహల్ 94 వికెట్లతో ఆ తర్వాత వరుసలో కొనసాగుతున్నారు.ఇక ఐపీఎల్ 2026 విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్‌లో తన బెస్ట్ ఇస్తున్నాడు. ఆర్సీబీ తరఫున ఈ సీజన్‌లో ప్రస్తుతానికి 9 మ్యాచ్‌లు ఆడిన భువీ.. రాజస్థాన్, ముంబైపై మినహా మిగతా అన్ని మ్యాచ్‌లలోనూ వికెట్లు తీసుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 పరుగులకే మూడు వికెట్లు తీసుకుని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గుజరాత్‌పై కేవలం ఒక్క వికెటే తీసుకోగా.. మిగతా అన్ని మ్యాచ్‌లలో ప్రతి మ్యాచ్‌కు మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 17 వికెట్లు తీసుకుని పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగా, సీఎస్కేపై 41 పరుగులకు 3, రాజస్థాన్‌పై 37, ముంబైపై 38 పరుగులు ఇచ్చి ఎలాంటి వికెట్లు తీసుకోలేదు. లక్నోపై 27 పరుగులకు మూడు, ఢిల్లీపై 26 పరుగులకు మూడు, గుజరాత్‌పై 1, ఢిల్లీపై 5 పరుగులకు మూడు, గుజరాత్‌పై 28 పరుగులకు మూడు వికెట్లు తీసుకుని ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.