భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ లో బరువు ఎక్కువ ఉన్న కారణంగా అనర్హత వేటుకు గురై పతకం కోల్పోయిన వినేశ్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. దీంతో ఆమె భవిష్యత్తు కార్యాచరణ రాజకీయాలేనని చాలా మంది అనుకుంటున్నారు. తాజాగా వినేష్ హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడాను ఆయన నివాసానికి వెళ్ళి కలిశారు. […]

vinesh phogat