Top story: సెల్ఫ్ సెలబ్రిటీ హోదా కోసం పోటీ పడుతున్న సుధారెడ్డి, ప్రీతి రెడ్డి.!

స్టార్ హీరోయిన్లకు వాళ్ల సినిమాలు ద్వారా, ఆ తర్వాత వచ్చే మూవీ హిట్ల ద్వారా సెలబ్రిటీ హోదా వచ్చేస్తుంది. ఆ హోదాతో రకరకాల బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ ఆ సెలబ్రిటీ స్టేటస్ నీ ఇంకా పెంచుకుంటూ ఉంటారు.

Post Published By: dialnews
Updated : 16 September 2026, 11:19 AM IST

స్టార్ హీరోయిన్లకు వాళ్ల సినిమాలు ద్వారా, ఆ తర్వాత వచ్చే మూవీ హిట్ల ద్వారా సెలబ్రిటీ హోదా వచ్చేస్తుంది. ఆ హోదాతో రకరకాల బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ ఆ సెలబ్రిటీ స్టేటస్ నీ ఇంకా పెంచుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో సామాజిక సేవా కార్యక్రమాలు, టెన్ కే రన్.... 5 కే రన్ లాంటి ఈవెంట్లలో, మొక్కలు నాటే కార్యక్రమాలలో పాల్గొంటూ జనంలో పాపులారిటీ సంపాదిస్తారు. వాళ్లకి సోషల్ రిలేషన్స్ కూడా ఆటోమేటిగ్గా పెరిగిపోతూ ఉంటాయి. పని పాట లేని జనం..... వీళ్ళని ఏదో దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళలా ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే కొందరు పెద్దింటి మహిళలు మాత్రం తమకు తామే సెల్ఫ్ సెలబ్రిటీ స్టేటస్ సృష్టించుకుంటూ జనంలో పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపార కుటుంబాల నుంచి ఎదుగుతున్న మహిళలు ఆ స్టేటస్ సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీనిని సోషల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ యాక్టివిటీ అని కూడా అంటారు.

హైదరాబాదు తో పాటు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న మహిళలు ఒకరు మేఘ కంపెనీ డైరెక్టర్ సుధా రెడ్డి, మరొకరు మల్లారెడ్డి సంస్థల డైరెక్టర్ ప్రీతి రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరే సెల్ఫ్ సెలబ్రిటీ హోదా కలవాళ్లు. ఇంకా చెప్పాలంటే ఆ సెలబ్రిటీ హోదా పెంచుకోవడానికి ఇద్దరు పోటీ పడుతున్నారు.సుధా రెడ్డి మేఘ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి సతీమణి. మేఘ డైరెక్టర్ కూడా. అయితే ఒక ఇన్ఫాస్ట్ట్రక్చర్ కంపెనీ డైరెక్టర్ గా కంటే ఫ్యాషన్ షోలు, న్యూయార్క్ మెట్ గాలా షోలు, ఇన్స్టా రీల్స్ ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. సుధా రెడ్డి వేసుకునే వందల కోట్ల రూపాయల డైమండ్ జ్యువెలరీ, డ్రెస్సులు, వరల్డ్ ఫేమస్ డిజైనర్స్ ఆమె కోసం తయారు చేసే దుస్తులు వీటిపై తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది.

ఆమధ్య న్యూయార్క్ మేట్ గాలలో సుధా రెడ్డి ధరించిన 145 కోట్ల రూపాయల విలువైన గ్రీన్ డైమండ్ యాంటిక్ జ్యువెలరీ గురించి దేశమంతా చర్చ జరిగింది. హైదరాబాదులో జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్ జడ్జిలలో సుధా రెడ్డి కూడా ఒకరు. ఈ ఫ్యాషన్ షోలు.... మెట్ గాలాలతోపాటు క్యాన్సర్ అవేర్నెస్ కోసం సుధా రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆమె 10 కె రన్ లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే సొంత గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. అయితే సుధా రెడ్డికి ఎటువంటి పొలిటికల్ ఆంబిషన్ లేదు. జస్ట్ పబ్లిక్ లో పాపులారిటీ సంపాదించుకోవాలి అనే ఆకాంక్ష మాత్రమే ఆమెలో కనిపిస్తుంది. ఎటువంటి వివాదాలకు సుధా రెడ్డి తావు ఇవ్వరు. కాకపోతే ఆమె అంతర్జాతీయ వేదికలపై మెరుస్తున్నప్పుడల్లా.... ఇన్ఫ్రా కాంట్రాక్టుల ద్వారా కొల్లగొట్టిన జనం సొమ్ము ఇలా ఖర్చు చేస్తున్నారంటూ విమర్శలు వస్తూ ఉంటాయి. అంతకుమించి మేఘసుధరెడ్డి పై ఎటువంటి వివాదాలు లేవు.

ఇక నిత్యం వార్తల్లో ఉండే మరో మహిళా , మల్లారెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి. సూపర్ యాక్టివ్ ఉమెన్. విపరీతమైన పొలిటికల్ యాంబిషన్ ఉన్న మహిళ. మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు డాక్టర్ భద్ర రెడ్డి భార్యా ప్రీతి రెడ్డి. గడచిన మూడు నాలుగు సంవత్సరాలలో హైదరాబాదులో పాపులర్ పర్సనాలిటీగా పేరు సంపాదించిన ప్రీతి రెడ్డి మంచి స్పీకర్, డాన్సర్, అడ్మినిస్ట్రేటర్ కూడా. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ తో పాటు ఇతర సంస్థలను కూడా నిర్వహిస్తున్నారు.2029లో కచ్చితంగా ఎంపీ కావాలనేది ప్రీతి రెడ్డి ప్లాన్. అందుకు ఏ అవకాశాన్ని ఆమె వదిలి పెట్టరు. తనకు ప్రమోషన్, పాపులారిటీ , సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది అని అనిపిస్తే చాలు ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇప్పటికే ఢిల్లీలో బిజెపి నాయకుల తో మంచి సంబంధాలు పెట్టుకున్నారు.

మల్లరెడ్డి సంస్థలను తన పాపులారిటీ కోసం చక్కగా వినియోగిస్తారు. మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ నీ కూడా ప్రీతి రెడ్డి తన పొలిటికల్ పాపులారిటీ పెంచుకోవడానికి ఉపయోగించుకోగలిగారు. ఆమధ్య మల్లారెడ్డి కాలేజీలో టాక్సిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టి విమర్శలు పాలయ్యారు. హైదరాబాదులో మిస్ వరల్డ్ ఫైనల్స్ లో మేఘ సుధా రెడ్డి లాగే తాను కూడా జడ్జి రోల్ కి వెళ్లాలని ప్రయత్నించారు. కానీ సుధా రెడ్డి ఫైనాన్షియల్ స్టేటస్ ముందు ప్రీతి రెడ్డి తేలిపోయారు. హైదరాబాదులో ఏ పెద్ద యాక్టివిటీ జరిగినా అక్కడ ప్రీతి రెడ్డి కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో అది మరీ ఎక్కువైంది. సినిమా ఫంక్షన్లు, ఫ్యాషన్ షో లను కూడా ఆమె వదిలిపెట్టడం లేదు . బెంగళూరు సైమా అవార్డుల ఫంక్షన్ రెడ్ కార్పెట్ లో సినిమా వాళ్లకు పోటీ ఇచ్చారు.

టీవీ చానల్స్ లో, మీడియాలో తరచూ ఇంటర్వ్యూ లు ఇవ్వడం ద్వారా తన పొలిటికల్ అంబిషన్ ని జనంలోకి పంపారు ప్రీతి రెడ్డి. ఆమె అనుకున్నట్టుగా అన్ని జరిగితే 2029 లో ప్రీతి రెడ్డి నీ లోక్సభలో చూస్తాం. మేఘ సుధా రెడ్డి కూడా మెడికల్ కాలేజీకి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే పొలిటికల్ అంబిషన్ ఉన్నట్లు ఎక్కడ బయట పడరు. ఎక్కడ అతి చొరవ కూడా ప్రదర్శించరు. ఫైనాన్షియల్ పొజిషన్ విషయానికి వస్తే ప్రీతి రెడ్డి కన్నా సుధారెడ్డి చాలా రెట్లు మెరుగైన స్థాయిలో ఉన్నారు. మేఘ సుధా రెడ్డి ది ఇంటర్నేషనల్ రేంజ్ అయితే, ప్రీతి రెడ్డిది పూర్తిగా లోకల్ రేంజ్. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో సుధా రెడ్డి ,ప్రీతి రెడ్డి సెల్ఫ్ సెలబ్రిటీ స్టేటస్ ని సంపాదించుకున్నారు.

 

 

Published : 
  • 16 September 2026, 11:19 AM IST