Mohan Babu: సెగ్గడ్డ అని ఆయన.. సిగ్గులేదా అని ఈయన.. మీడియా మీద పెతాపమేంది మోహనా..?
క్రమశిక్షణకు, పట్టుదలకు మారు పేరు అంటారు మంచు కుటుంబం. మీడియా వాళ్ల మీద మాత్రం కస్సుమంటారు అదేంటో..! కోపం ఎక్కువైనా, ప్రేమ ఎక్కువైనా.. అక్కడిక్కడే చూపించేస్తుంటారు. మంచు కథలు ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? మీడియా మీద మళ్లీ గుస్సా అయ్యారు రామన్న చౌదరి.. అలియాస్ పెదరాయుడు.