ap elections 2024

AP Politics: అప్పుడు వార్నింగ్‌లు.. ఇప్పుడు విన్నపాలు.. జగన్‌కు ఎమ్మెల్సీ ఎఫెక్ట్ గట్టిగా తగిలిందా?

AP Politics: అప్పుడు వార్నింగ్‌లు.. ఇప్పుడు విన్నపాలు.. జగన్‌కు ఎమ్మెల్సీ ఎఫెక్ట్ గట్టిగా తగిలిందా?

తాజాగా జగన్ మాట్లాడిన మాటలే ఇప్పుడు.. నేతల్లో, జనాల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. జగన్ అంటే.. పార్టీలో లీడర్‌కు మించి డిక్టేటర్‌ అంటుంటారు. నా మాటే శాసనం అనే రేంజ్‌లో పార్టీలో ఆయన నిర్ణయాలు ఉంటాయ్. అందుకే ఆయన చెప్పింది వినడమే తప్ప.. జగన్‌ మాటకు ఎదురు చెప్పాలన్నా.. ఓ మాట తిరిగి అనాలన్నా.. చోటా మోటా నేతల నుంచి ఎమ్మెల్యేల వరకు వణికిపోతుంటారనే చర్చ ఉంది ఏపీ రాజకీయాల్లో ! నిజానికి గతంలో జరిగిన మీటింగ్‌లు, చేసిన వార్నింగ్‌లు చెప్పింది కూడా అదే ! గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంపై గతంలో సమీక్ష నిర్వహించిన జగన్.. ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పదు అనుకుంటే తప్పించడానికి కూడా సిద్ధం అని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.