YS SHARMILA: ప్రధాని మోదీకి షర్మిల లేఖ.. విభజన హామీలు నెరవేర్చాలని వినతి
రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏపీ కోసం కేంద్రం అనేక హామీలు ఇచ్చిందని షర్మిల గుర్తు చేశారు. అయితే, 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుపై పెద్దగా దృష్టి పెట్టలేదని, రాష్ట్రం విడిపోయి పదేళ్లైనా విభజన హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని షర్మిల గుర్తు చేశారు.