YSR Jayanti celebrations : నేడు విజయవాడకు సీఎం రేవంత్, మంత్రులు.. YSR జయంతి వేడుకలకు హాజరు

వైఎస్ఆర్ 75వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏపీ పీసీసీ చీఫ్, వైఎస్ కుమార్తె షర్మిల నిర్ణయించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 July 2024, 10:45 AM IST

 

 

వైఎస్ఆర్ 75వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏపీ పీసీసీ చీఫ్, వైఎస్ కుమార్తె షర్మిల నిర్ణయించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75వ జయంతి సభకు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సోనియా, రాహుల్ గాంధీలు సహా పలువులు కీలక నేతల్ని ఆహ్వానించారు.

దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరి.. అక్కడి నుంచి రోడ్డు మార్గాంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలకు హాజరుకానున్నారు. అనంతరం ఇదే రోజు రాత్రికి తిరిగి హైదరాబాద్‌ రానున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలుగు రాష్ట్రాలలో వైఎస్ తో సాన్నిహిత్యం ఉన్న అందర్నీ ఆహ్వానించారు. ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి వైఎస్ జయంతిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

Published : 
  • 8 July 2024, 10:45 AM IST