baby

Avinash, Anuja, Miss Carrie : బిడ్డను కోల్పోయిన ముక్కు అవినాష్‌

Avinash, Anuja, Miss Carrie : బిడ్డను కోల్పోయిన ముక్కు అవినాష్‌

జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమేడియన్స్‌లో ముక్కు అవినాష్‌ కూడా ఒకరు. చక్కటి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో.. బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలు చేయడంతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌లో ముందుకు వెళ్తునే 2021లో ఓ ఇంటివాడు అయ్యాడు అవినాష్‌. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు.