Wines bandh : నేటి నుంచి మూడు రోజులు వైన్స్ బంద్.. పోలింగ్ నేపథ్యంలో ఆంక్షలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు.. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. నవంబర్ 28 మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 30 గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముందస్తు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలుండగా.. అవన్ని కూడా మూతబడనున్నాయి.